చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌గిఫ్ట్‌ అందుతుంది

ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారని కేసీఆర్ మండిపడ్డారు. తాను, తమ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, కానీ హోదా కంటే ప్యాకేజీయే మేలని బాబు అనలేదా అంటూ ప్రశ్నించారు. హైకోర్టు విభజనపైనా చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

Update: 2018-12-29 13:37 GMT

ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారని కేసీఆర్ మండిపడ్డారు. తాను, తమ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, కానీ హోదా కంటే ప్యాకేజీయే మేలని బాబు అనలేదా అంటూ ప్రశ్నించారు. హైకోర్టు విభజనపైనా చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లిపొమ్మని తాము చెప్పలేదని, డిసెంబర్ నాటికి వెళ్లిపోతామని ఏపీ ప్రభుత్వమే సుప్రీంలో అఫిడవిట్‌ ఫైల్ చేశారని, తీరా హైకోర్టును విభజించాక, ఇప్పుడు చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మూడు నాలుగొందల కోట్ల రూపాయలతో తెలంగాణలో అద్బుతమైన సెక్రటేరియట్‌ నిర్మించాలనుకున్నామని, కానీ కేంద్రం 15వందల కోట్లు ఇచ్చినా ఏపీలో సచివాలయం నిర్మించలేకపోయారని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఓడిపోయినందుకు ఏపీ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు అన్నారు. తెలంగాణ జై అని చంద్రబాబుతో అనింపించాం. చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ అందుతుందని కెసిఆర్ అన్నారు. 

Similar News