Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
WhatsApp New Features: వాట్సాప్ వినియోగం ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉండాల్సిందే అన్నట్లు పరిస్థితులు మారాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది వాట్సాప్. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఏంటా ఫీచర్? దాని ఉపయోగం ఏంటి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనకు తెలియని భాషలో ఏవైనా మెసేజ్‌లు వస్తే ఏం చేస్తాం. సదరు మెసేజ్‌ను కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో వేసి మనకు వచ్చిన భాషలోకి తర్జూమా చేసుకొని అర్థం చేసుకుంటాం. అయితే ఇందుకోసం మళ్లీ బ్రౌజర్ ఓపెన్ చేసి మెసేజ్‌ను పేస్ట్ చేయడం వంటి ప్రాసెస్ ఉంటుంది. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను క్షణాల్లో మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.26.9లో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే యూజర్లలందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇకపై ట్రాన్స్‌లేషన్‌కు వేరే టూల్‌ను ఉపయోగించాల్సి అవసరం ఉండదని చెబుతున్నారు.
ఈ ఫీచర్ పూర్తిగా యూజర్ డివైజ్‌లోనే జరుగుతుంది. ఫ్రీ డౌన్ లోడెడ్ లాంగ్వేజీ ప్యాక్స్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాబట్టి థర్డ్ పార్టీ సర్వర్లకు గానీ, వాట్సప్ సర్వర్లకు గానీ డేటాను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక మీకు వచ్చే ప్రతీ మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేయాలా? లేదా సెలక్ట్ చేసిన మెసేజ్‌లను మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయాలా అన్న ఆప్షన్ మీ ఇష్టం. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.