Bajaj Bike: కేవలం రూ.10వేలు చెల్లించి ప్రపంచంలోని మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఇంటికి తెచ్చుకోండి
Bajaj Freedom125 CNG bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 గత కొన్ని నెలలుగా మార్కెట్లో అద్భుతాలను నమోదు చేస్తుంది.
Bajaj Freedom125 CNG bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 గత కొన్ని నెలలుగా మార్కెట్లో అద్భుతాలను నమోదు చేస్తుంది. ఒక ఎకనామిక్ బైక్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ తక్కువ ధర, అద్భుతమైన మైలేజీ, గొప్ప ఫీచర్ల కారణంగా విడుదలైన కొన్నాళ్లకే భారీ ప్రజాదరణ పొందింది. ఢిల్లీలో బజాజ్ ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.89 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ.1 లక్ష 3 వేలు. బైక్ దేఖో వెబ్‌సైట్ ప్రకారం.. ఈ బైక్‌ను కస్టమర్లు రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. డౌన్‌పేమెంట్ చెల్లించిన తర్వాత మిగిలిన రూ.93 వేల 657మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి మూడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3,000 వాయిదా చెల్లించాలి. ఈ విధంగా మొత్తం రూ.1 లక్షా 8 వేల 324 చెల్లించాల్సి ఉంటుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ ఫీచర్లు (Bajaj Freedom 125 Bike Features)
బజాజ్ ఫ్రీడమ్ బైక్‌లో పవర్ ఫుల్ 125సీసీ ఇంజన్ ఉంది. ఇది మెరుగైన పవర్‌తో పాటు అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఇది యువతతో పాటు కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ బైక్‌లో మీరు డిజిటల్ డిస్‌ప్లే, ఎల్ ఈడీ లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి అనేక గొప్ప ఫీచర్లను పొందుతారు. ఈ సౌకర్యవంతమైన సీటింగ్ ఈ బైక్ లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్.
బజాజ్ ఫ్రీడమ్ బైక్ మైలేజ్ (Bajaj Freedom bike mileage)
మిగతా బైకులతో పోలిస్తే తక్కువ ధరలో విడుదల చేసినందున ఈ బైక్‌ను కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఈ బైక్‌కు సంబంధించి, ఈ బైక్ లీటరుకు 60-65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, ఇది ఇంధన వినియోగం పరంగా పొదుపుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
అద్భుతైమన బైక్ సీటింగ్
ఈ బైక్‌లో డిజిటల్ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఇది దూర ప్రయాణాలకు కూడా మంచి ఆఫ్షన్. ఇది పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఈ రెండు ఇంధనాలు కలిపి మొత్తం 330 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. దీనితో ఆపకుండా తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, కానీ సీఎన్జీ ఎంపికతో డబ్బులను కూడా పొదుపు చేస్తుంది.