స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి సురేష్..గోవాలో సాంప్రదాయ పద్దతిలో జరిగిన పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)హ బంధంలోకి అడుగు పెట్టింది. తన స్నేహితుడు ఆంటోని (Antony Thattil)ని వివాహం చేసుకున్నారు.
కీర్తి సురేష్ (Keerthy Suresh)హ బంధంలోకి అడుగు పెట్టింది. తన స్నేహితుడు ఆంటోని (Antony Thattil)ని వివాహం చేసుకున్నారు.గోవా (goa)లోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు.ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.
15ఏళ్ల స్నేహ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది కీర్తి. స్కూల్ డేస్ నుంచి కీర్తి సురేష్-ఆంటోని కలిసి చదువుకున్నారు. అయితే అది కాస్త కాలేజీ డేస్‌కు వచ్చే సరికి ప్రేమగా మారింది. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ విషయాన్ని ఆమె బయటపెట్టారు.దీపావళి సందర్భంగా ఆంటోనితో దిగిన ఫొటోనే షేర్ చేసింది. తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపింది.
ఆంటోని కొచ్చి ప్రాంతానికి చెందినవారు. వారిది వ్యాపార కుటుంబం. చెన్నై, కొచ్చిలో వారికి వ్యాపారాలున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆంటోనీ.. గ్రాడ్యుయేషన్ తర్వాత ఖతర్‌లో చాలా కాలం పనిచేశారు. ఆయనకు దుబాయిలో కూడా వ్యాపారాలున్నాయి. రిసార్ట్ లతో సహా ఎన్నో రకాల బిజినెస్‌లను ఆంటోని చేస్తూ ఉంటారు. కేరళ, చెన్నై అంతటా కూడా హాస్పిటల్ వెంచర్లలో కూడా ఆంటోనికి వ్యాపారాలు ఉన్నాయి.
కీర్తి సురేష్ తండ్రి ప్రముఖ మలయాళ నిర్మాత జి.సురేష్ కుమార్, తల్లి ప్రముఖ మలయాళ హీరోయిన్ మేనక. సినీ బ్యాగ్రౌండ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. తెలుగులో రామ్ సరసన నేను శైలజ సినిమాతో ప్రేక్షకులకు పరిచమైంది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో ఏకంగా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. ఇక ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ సినిమాలో చేస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.