Rachakonda CP warning Manchu Vishnu: మీ నాన్నకు..మీకు ఇదే లాస్ట్ వార్నింగ్..లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించరాదు..విష్ణుకు రాచకొండ సీపీ సూచన

Update: 2024-12-12 02:11 GMT

Rachakonda CP warning Manchu Vishnu: రాచకొండ కమిషనరేట్ లో సీపీ ఎదుట మంచు విష్ణు విచారణకు హాజరయ్యారు. మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహారించకూడదని ఈ సందర్భంగా మంచు విష్ణుకు సీపీ సూచించారు. మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడకూదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఈనెల 24 వరకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు గురించి సీపీకి మంచు విష్ణు తెలిపారు.

ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉన్నా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని విష్ణుకు సీపీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే లక్ష రూపాయల జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని సీపీ సుధీర్ బాబు మంచు విష్ణుకు తెలిపారు. మంచు విష్ణును వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ ఆదేశించిన నేపథ్యంలో సీపీ ఆఫీసుకు వెళ్లారు విష్ణు. మంచు ఫ్యామిలీ వివాదం కేసులో నేరేడ్ మెట్ లోని సీపీ కార్యాలయంలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో మంచు విష్ణును విచారించారు సీపీ.

సీపీ ఎదుట బుధవారం ఉదయం మంచు విష్ణును విచారించారు. ఈ సందర్బంగా మనోజ్ నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఫ్యామిలీ మ్యాటర్స్ శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని సీపీ వారికి చెప్పారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనోజ్ కు సీపీ సూచించారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులకు పాల్పడనంటూ మనోజ్ పోలీసులకు తెలిపారు.

ఇక ఈ కేసులో హీరో మంచు మనోజ్ పై దాడి చేసిన విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనపై దాడి చేశాడని మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జల్ పల్లిలో తనపై దాడి చేయడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ లు మాయం చేశారన్న మనోజ్ కంప్లైంట్ మేరకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్, వినయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది. ఇదే కేసులో 4 మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News