Manchu Manoj: ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్
Manchu Manoj: ఇలాంటి రోజు వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని మంచు మనోజ్ చెప్పారు.
Manchu Manoj: ఇలాంటి రోజు వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని మంచు మనోజ్ చెప్పారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో బాధలు అనుభవించిందని ఆయన గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆగాను, ఇక ఆగలేనని ఆయన చెప్పారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అన్ని విషయాలు సాయంత్రం చెబుతానని మంచు మనోజ్ మీడియాకు తెలిపారు.
తన తండ్రి దేవుడని.. ఇలా ఉండేవాడు కాదన్నారు. తన తండ్రి స్నేహితులు చెప్పడం వల్లే తాను తిరిగి ఇంటికి వచ్చానన్నారు. తన వ్యక్తిగత జీవితం మినహా తాను ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. ఆ అమ్మాయి కోసం పోరాటం చేశానని మనోజ్ తెలిపారు. ఇందులో తప్పుందా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ సంతకాలు పెట్టాలంటే అక్కడ పెట్టాను... ఎన్ని సినిమాలు చేయాలంటే అన్ని సినిమాలు చేశానని ఆయన చెప్పారు.
భార్య వచ్చాక తాను మారినట్టు ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. తన అన్న, వినయ్ వల్ల తన తండ్రి మారాడని ఆయన ఆరోపించారు. తాను మద్యానికి బానిసగా మారి దాడి చేశానని తన తండ్రి చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను మద్యం తాగి ఎవరిపై దాడి చేశానో చెప్పాలన్నారు. సీసీటీవీ రికార్డులు బయటపెడితే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.