Niharika: మెగా డాటర్ నిహారికపై దారుణమైన ట్రోల్స్..మెగా ఫ్యామిలీ పరువు తీస్తుందంటూ కామెంట్స్

Update: 2024-12-11 04:48 GMT

Niharika: తెలుగు చిత్రపరిశ్రమలో మెగా డాటర్ నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు దాదాపు 10ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. యాంకర్ గా, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతూనే ఉన్నారు. ప్రస్తుతం నిహారిక మద్రాస్కారన్ అనే తమిళ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో కాదన్ సడగుడు సాంగ్ తాజాగా యూట్యూబ్ లో విడుదలై సంచలనం క్రియేట్ చేస్తోంది.

అయితే మెగా ఫ్యామిలీ పరువు తీస్తుందని నిహారికపై ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. నిహారిక మెగా కాంపౌండ్ కు చెందిన అమ్మాయి కావడం, నాగబాబు ముద్దుల కూతురు కావడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు అభినయ పాత్రలు మాత్రమే ఇస్తుంటారు. అయితే నిహారిక హీరోయిన్ గా ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు మాత్రం కమర్షియల్ గా అంతగా రాణించలేవు. తెలుగులో మెగా ఇమేజ్ ఆమెకు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయ్యిందనే చెప్పవచ్చు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.

తమిళ ఇండస్ట్రీలో గ్లామరస్ డోస్ పెంచుతూ మాంచి సక్సెస్ అందుకోవాలని నిహారిక ప్లాన్ వేసినట్లు సమాచారం. తమిళంలో మెగా ఇమేజ్ ఉన్న ఆమెకు ఎలాంటి సమస్యలు వచ్చినా నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు నిహారిక తమిళ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. నిహారిక బోల్డ్ గా కనిపించడంపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం తనకు సపోర్టు చేస్తున్నారు. కెరీర్ పరంగా తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే హక్కు నిహారికకు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్ల వలే నిహారిక కూడా హద్దులు దాటడంలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News