Manchu Lakshmi: ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు.. మంచు లక్ష్మి పోస్ట్‌ వైరల్‌

Manchu Lakshmi: తాజాగా నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ట్విట్టర్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Update: 2024-12-12 05:23 GMT

Manchu Lakshmi

Manchu Lakshmi: మంచు కుటుంబంలో నెలకొన్న వివాదం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. మంచు మనోజ్‌ వర్సెస్‌ మోహన్‌ బాబు అండ్ విష్ణు అన్నట్లు సాగుతోన్న ఎపిసోడ్‌ రోజుకో మలుపు తీసుకుంటోంది. పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ వ్యవహారం నడుస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం కావాల్సిన వ్యవహారం కాస్త ప్రస్తుతం రచ్చగా మారింది. ఈ నేపథ్యంలోనే మంచు కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో చేసే పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ట్విట్టర్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఓ రచయిత రాసిన కొటేషన్‌ను షేర్‌ చేసుకున్నారు. ‘ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు.. ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు’ అంటూ ఓ రచయిత రాసిన కొటేషన్‌ను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాల తరుణంలో మంచి లక్ష్మి చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.



ఇదిలా ఉంటే బుధవారం కూడా మంచు లక్ష్మి ఇలాంటి ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. తన కుమార్తె నవ్వుతున్న వీడియోను షేర్‌ చేసిన మంచు లక్ష్మి 'శాంతి' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. 2024లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇక మంచు లక్ష్మి కెరీర్‌ విషయానికొస్తే.. ఈ నటి ఇటీవల ‘యక్షిణి’ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు.

కాగా ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబయిలో నివాసం ఉంటున్నారు. దక్షిణాదిలో తాను ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించానని, కాకపోతే ఇక్కడ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముంబయిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News