Allu Arjun's Actress: వరుడు మూవీ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Update: 2024-12-12 08:00 GMT

Allu Arjun varudu movie Actress: అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన వరుడు మూవీ గుర్తుండే ఉంటుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి. వివాహం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీకి జోడిగా భాను శ్రీ మెహ్రా అనే హీరోయిన్‌ నటించింది. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబయికి వచ్చి మోడలింగ్‌లోకి ప్రవేశించింది.

కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌‌లో నటించిన తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సమయంలో భానుశ్రీని చిత్ర యూనిట్‌ ఇండస్ట్రీకి వెరైటీగా పరిచయం చేసింది. సినిమా విడుదల వరకు హీరోయిన్‌ ఎవరనే విషయం చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో భాను శ్రీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

మొదటి చిత్రంతోనే పరాజయం ఎదురుకావడంతో భానుశ్రీ రెండో చిత్రానికే సైడ్‌ క్యారెక్టర్‌ పాత్రకు పరిమితమైంది. తర్వాత చిల్కూరి బాలాజీ, ప్రేమతో చెప్పనా, మహారాజ శ్రీ గాలిగాడు, లింగడు-రామలింగడు, అంతా నీ మాయలోనే వంటి పలు సినిమాల్లో నటించింది.. కానీ ఇవేవీ విడుదల కాకపోవడం గమనార్హం. ఇక తర్వాత కన్నడ, పంజాబీ, తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. కాగా రీసెంట్‌గా 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి', 'సింబా' చిత్రాల్లో నటించింది. ఇక చివరిగా కీర్తి సురేశ్ నటించిన‌ 'మిస్‌ ఇండియా' చిత్రంలోనూ కనిపించింది.

క్రమంగా సినిమాలకు దూరమైన భానుశ్రీ.. 2018లో ప్రియుడు కరణ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న భానుశ్రీ సినిమాలకు బాగా దూరంగా ఉంటోంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోన్న భానుశ్రీ తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News