Sai Pallavi: ఇక సహించను.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సాయిపల్లవి
Sai Pallavi: సాయి పల్లవి తనపై వస్తున్న రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ (Bollywood)లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా నటిస్తోంది సాయిపల్లవి (Sai Pallavi).
Sai Pallavi: సాయి పల్లవి ( Sai Pallavi) తనపై వస్తున్న రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ (Bollywood) లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీత (sita) గా నటిస్తోంది సాయిపల్లవి (Sai Pallavi). అయితే ఈ చిత్రం కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చింది.
రామాయణ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని.. హోటల్స్ లో కూడా తినడం లేదని కోలీవుడ్ లోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. సాయి పల్లవి విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తుందని ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి గట్టిగానే సమాధానం ఇచ్చింది.
తనపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి.. వస్తున్నాయి. కానీ నేను ప్రతి సారి మౌనంగానే ఉన్నానని చెప్పారు. ఎందుకుంటే నిజం ఏంటనేది దేవుడికి తెలుసు. కానీ ఇలా మౌనంగా ఉంటున్నానని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు వాటిపై స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. తన సినిమాల రిలీజ్ లు, ప్రకటనలు, కెరీర్ ఇలా తనకు సంబంధించి ఏదైనా నిరాధారమైన వార్తలు రాస్తే.. చట్టబద్దమైన యాక్షన్ తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఇన్నాళ్లు సహించాను.. ఇకపై ఇలాంటి చెత్త వార్తలను మోసుకెళ్లడానికి తాను సిద్ధంగా లేనని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి ప్రేమమ్ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రామాయణ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
ఇక రీసెంట్‌గా శివ కార్తికేయన్‌తో కలిసి అమరన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో తండేల్ చిత్రంలో నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది.