Manchu Mohanbabu: ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్

మోహన్ బాబు (Mohan babu ) హైదరాబాద్ కాంటినెంటల్ (continental hospital) ఆసుపత్రి నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు.

Update: 2024-12-12 11:20 GMT

 Manchu Mohanbabu: ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్


మోహన్ బాబు (Mohan babu ) హైదరాబాద్ కాంటినెంటల్ (continental hospital) ఆసుపత్రి నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 10న రాత్రి ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు.కంటి దిగువ భాగంలో గాయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించి రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు.

డిసెంబర్ 10న తన నివాసం వద్ద జరిగిన గొడవకు సంబంధించి విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. దీనిపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24 వరకు స్టే విధించింది హైకోర్టు.డిసెంబర్ 8న తనపై దాడి జరిగిందని మంచు మనోజ్ (Manchu manoj) 100 కు ఫోన్ చేయడంతో విషయం వెలుగు చూసింది. మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు రిపోర్టర్లు గాయపడ్డారు. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News