Gukesh: 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్.. ఎవరీ గుకేశ్?
ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేశ్ నిలిచారు. చైనాకు చెందిన లిరెన్ ను ఆయన ఓడించారు. 18 ఏళ్ల వయసులోనే ఆయన చెస్ ఛాంపియన్ గా నిలిచారు.
ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేశ్ (gukesh). చైనాకు చెందిన లిరెన్ (Ding Liren)ను ఆయన ఓడించారు. 18 ఏళ్ల వయసులోనే ఆయన చెస్ ఛాంపియన్ గా (World Chess Championship match )నిలిచారు.18 ఏళ్ల వయస్సులోనే 18 ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను ఆయన దక్కించుకున్నారు.
చిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ దక్కించుకున్న రికార్డును ఆయన క్రియేట్ చేశారు.ఫైనల్ గేమ్ లో ఇద్దరికి 6.5 పాయింట్లు వచ్చి టై అయింది. అయితే 14 గేమ్ లో లిరెన్ ను ఆయన ఓడించారు.గ్యారీ కాస్పరోవ్ రికార్డును బద్దలు కొట్టారు గుకేశ్. 22 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన గ్యారీ కాస్పరోవ్. ఈ రికార్డును గుకేశ్ తిరగరాశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన రెండో భారతీయుడు గుకేశ్.అంతకు ముందు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సాధించిన భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్.ఐదుసార్లు ఆయన ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచారు. 2013 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన తొలి భారతీయుడు గుకేశ్.
ఎవరీ గుకేశ్?
తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవారు గుకేశ్. 2006 మే 29న ఆయన చెన్నైలో జన్మించారు. గుకేశ్ తండ్రి రజనీకాంత్. ఆయన ముక్కు, చెవి, గొంతు డాక్టర్. తల్లి పద్మ. ఆమె మైక్రోబయాలిజిస్ట్. ఏడేళ్ల వయస్సున్నప్పుడే గుకేశ్ చెస్ ఆడడం నేర్చుకున్నారు. చెన్నైలోని వీలమ్మాల్ విద్యాలయంలో చదువుకున్నారు.
వారంలో మూడు రోజులు, గంట పాటు చెస్ ఆడడాన్ని 2013లో ఆయన ప్రాక్టీస్ చేశారు.వీకేండ్స్ లో ఆయన చెస్ టోర్నమెంట్స్ లో పాల్గొనేవారు. ఇందులో ఆయన ఆటతీరును టీచర్లను అభినందించారు.2015లో అండర్ -9 ఆసియన్ స్కూల్ చెస్ చాంపియన్ షిప్ లో ఆయన నెగ్గారు. 2018లో ప్రపంచ యూత్ చెస్ అండర్ 12 లో పాల్గొన్నారు. ఇందులో ఐదు మెడల్స్ సాధించారు.
2021 జూన్ లో జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్, గెల్ఫాండ్ ఛాలెంజ్‌లో 19 పాయింట్లకు గాను 14 పాయింట్లు చేసి గెలిచారు.2023 ఫిబ్రవరి లో డ్యూసెల్డార్ఫ్‌లో చెస్ పోటీల్లో లెవాన్ అరోనియన్ ఇయాన్ నెపోమ్నియాచితో కలిసి మొదటి స్థానంలో నిలిచారు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్ట్‌లో 2750 పాయింట్లు సాధించిన అత్యంత పిన్న వయస్సున్న ఆటగాడు.