Harbhajan Singh-Dhoni: ధోనీ, నేను స్నేహితులం కాదు.. హర్భజన్‌ షాకింగ్ కామెంట్స్‌..!

Harbhajan Singh-Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్‌ చేశారు.

Update: 2024-12-04 07:01 GMT

Harbhajan Singh-Dhoni: ధోనీ, నేను స్నేహితులం కాదు.. హర్భజన్‌ షాకింగ్ కామెంట్స్‌..!

Harbhajan Singh-Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. తాను, ధోనీ స్నేహితులం కాదని.. ఇద్దరి మధ్య మాటల్లేవని చెప్పారు. తమ మధ్య మాటల్లేక 10 సంఏళ్లు దాటిందని.. ధోనీతో తనకు ఏ సమస్య లేదని తెలిపారు. సంబంధం ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుందని, మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి కూడా మనం అదే ఆశిస్తాం అని హర్భజన్ పేర్కొన్నారు. ధోనీ, భజ్జీ కలిసి భారత జట్టులో మాత్రమే కాకుండా.. ఐపీఎల్‌లో కూడా కలిసి ఆడారు. మహీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ భారత్ గెలవగా.. జట్టులో భజ్జీ ఉన్నారు.

రిటైర్మెంట్ అనంతరం హర్భజన్ సింగ్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జాతీయ మీడియా న్యూస్ 18తో హర్భజన్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. 'నేను ఎంఎస్ ధోనీతో మాట్లాడను. నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడినపుడు మాట్లాడుకున్నాము. అయితే అది మైదానంలో ఉన్నపుడే. మా మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటింది. నాకు ధోనీతో ఏ సమస్య లేదు. అతడే నాతో మాట్లాడటం లేదు. కారణం ఏంటో కూడా నాకు తెలియదు. నేను కూడా అడగలేదు. చెన్నైకి ఆడినపుడు మహీ నా గదిలోకి రాలేదు, నేను కూడా అతడి గదిలోకి పోలేదు. మరోసారి చెబుతున్నా ధోనీతో నాకేం విరోధం లేదు' అని భజ్జీ చెప్పాడు.

'ఎంఎస్ ధోనీ ఏదైనా చెప్పాలనుకుంటే.. నాకు చెప్పగలడు. ఏదైనా ఉంటే ఎప్పుడో చెప్పేవాడు, ఇక ఆ అవసరం రాదనుకుంటా. నేను ఎప్పుడూ అతడికి ఫోన్ చేయను. మహీ కూడా చేయదు. నా ఫోన్ కాల్స్‌కి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వారికే చేస్తాను. నాకు స్నేహితులుగా ఉన్న వారితో టచ్‌లో ఉంటా. సంబంధం అనేది ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటివారిని గౌరవిస్తే.. వారి నుంచి కూడా అదే ఆశిస్తాం కదా. 1-2 సార్లు ఫోన్ చేసినా.. స్పందించకపోతే పక్కన పెడతా. అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తా. ధోనీతో కూడా ఇంతే' అని హర్భజన్‌ సింగ్ చెప్పుకొచ్చారు.

హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ చివరిసారిగా 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో కలిసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2015 ప్రపంచకప్ తర్వాత హర్భజన్ సహా యువరాజ్ సింగ్‌లు భారత జట్టుకు దూరమయ్యారు. 2015 తర్వాత భజ్జీ ఆడకపోయినా.. 2021లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ధోనీ జట్టులోకి రాకముందు హర్భజన్, యువరాజ్, సెహ్వాగ్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. మహీ 2007లో ప్రపంచకప్ గెలవడంతో మహీ టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచే ఈ నలుగురి మధ్య పెద్దగా మాటలు ఉండేవి కావు. ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు.

Tags:    

Similar News