Wide ball rules: బౌలర్ల కోసం వైడ్ బాల్ రూల్స్ మారుస్తున్నారా?
Wide ball rules: బౌలర్ల కోసం వైడ్ బాల్ రూల్స్ మారుస్తున్నారా? ఐసీసీ క్రికెట్ కమిటీ మెంబర్, సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్ రౌండర్ షాన్ పొల్లాక్ ఏం చెబుతున్నాడంటే...
ICC working on Wide ball rules: క్రికెట్లో వైడ్ బాల్ రూల్స్ మారనున్నాయా? ఇప్పటివరకూ ఉన్న వైడ్ బాల్ రూల్స్ కు పాతరేసి ఐసీసీ క్రికెట్ కమిటీ కొత్త రూల్స్ తీసుకొచ్చే ఆలోచనలో ఉందా? తాజాగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ లెజెండ్ షాన్ పొల్లాక్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అవుననే సందేహమే కలుగుతోంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న తరుణంలోనే షా న్ పొల్లాక్ ఓ కీలకమైన ప్రకటన చేశారు. బౌలర్లు బౌలింగ్ చేసేటప్పుడు బాటర్స్ చివరి క్షణంలో తమ పొజిషన్ మార్చుకుంటున్నారు. దీనివల్ల బాల్ వైడ్ అవడం, దాన్ని ఎక్స్ట్రా రన్ కింద బ్యాటింగ్ జట్టు స్కోర్ చేసుకోవడం అవుతోందన్నారు. ఇది బౌలర్లకు ఇబ్బందికరమైన పరిణామంగా మారిందని అభిప్రాయపడ్డారు.
బ్యాటర్స్ చివరి క్షణంలో కదులుతారని బౌలర్లు ముందే ఎలా పసిగడతారు అని సందేహం వ్యక్తం చేసిన పొల్లాక్... అందుకే బౌలర్లకు ఉన్న ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఐసీసీ క్రికెట్ కమిటీ నడుం బిగించిందని తెలిపారు. బౌలింగ్ చేసే బౌలర్ కు తను ఏం చేస్తున్నారో, ఎక్కడ బంతిని వేయబోతున్నారో ముందే తెలిసుండాలని చెబుతూ పొల్లాక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్ రౌండర్ షాన్ పొల్లాక్ ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అందుకే ఈ వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. వైడ్ బాల్ రూల్స్ మార్పు అనేది ప్రస్తుతం చర్చల దశలో ఉందని తెలిపారు.