Novak Djokovic: టెన్నిస్ లెజెండ్ నోవాక్ జొకోవిచ్ పై విష ప్రయోగం..!

Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.

Update: 2025-01-10 08:47 GMT

Novak Djokovic: టెన్నిస్ లెజెండ్ నోవాక్ జొకోవిచ్ పై విష ప్రయోగం..!

Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఇది క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్-2025 కి ముందు జొకోవిచ్ ఈ వాదన చేశాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు తనను అదుపులోకి తీసుకున్నప్పుడు తన మీద విషప్రయోగం జరిగిందని జొకోవిచ్ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్-2022కి ముందు తప్పుడు సమాచారం అందించినందుకు జొకోవిచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడి వీసా రద్దు చేయబడింది. అతని దేశానికి తిరిగి పంపబడ్డాడు. ఇంతలో అతను చట్టపరమైన చర్యల సమయంలో మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌లో బస చేశాడు. అప్పుడే తనకు విషప్రయోగం జరిగిందని జొకోవిచ్ పేర్కొన్నాడు.

ఆ సమయంలో ఆస్ట్రేలియాలో కోవిడ్-19కి సంబంధించి కఠినమైన నియమాలు ఉండేవి. జొకోవిచ్ ఆ నియమాలను పాటించలేదు. అతను కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. దీని కారణంగా చాలా గొడవ జరిగింది. "నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మెల్‌బోర్న్‌లోని హోటల్‌లో నాకు విషపూరిత ఆహారం ఇచ్చారు." అని జొకోవిచ్ గోల్డ్ క్వెస్ట్‌తో అన్నారు. తనకు తీవ్రమైన జ్వరం వచ్చిందని, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డానని జొకోవిచ్ చెప్పాడు. అతను తన దేశమైన సెర్బియాకు వచ్చిన తర్వాత, కొన్ని పరీక్షలు చేయించుకున్నానని, అందులో తనలో సీసం, పాదరసం వంటి లోహం ఉన్నట్లు కనుగొన్నానని చెప్పాడు. జొకోవిచ్ కోవిడ్ నియమాలను పాటించలేదు. దీని కారణంగా అతను 2022 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోలేకపోయాడు.

ఈ సంవత్సరం జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొంటున్నాడు. అతని దృష్టి అంతా 25వ గ్రాండ్ స్లామ్ గెలవడంపై ఉన్నాయి. అతను 2023లో టోర్నమెంట్‌లోకి తిరిగి వచ్చి టైటిల్‌ను గెలుచుకున్నాడు. తాను ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడల్లా ఆ పాత రోజులను గుర్తుచేసుకుంటానని జొకోవిచ్ అన్నాడు. "గతంలో నేను ఆస్ట్రేలియాకు వచ్చి పాస్‌పోర్ట్ రద్దు కావడంతో సెర్బియాకు వెళ్లిపోయాను. అది పాత జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. ఇమ్మిగ్రేషన్ ద్వారా వెళ్ళేటప్పుడు నాకు ఇప్పటికీ అసౌకర్యంగా అనిపిస్తుంది" అని నోవాక్ జొకోవిచ్ చెప్పాడు.

Tags:    

Similar News