ఊచకోత అంటే ఇదేనేమో.. 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు..!
Bangladesh Premier League: బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం టీ 20 నడుస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో సహా అనేక మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఈ మ్యాచ్ లలో పాల్గొన్నారు.
Bangladesh Premier League: బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం టీ 20 నడుస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో సహా అనేక మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఈ మ్యాచ్ లలో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్ అక్కడ తుది స్థాయికి చేరుకుంది. జనవరి 6న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో ఒక జట్టు కెప్టెన్ 16 జట్లతో ఆడిన అనుభవం ఆయన సొంతం. ఈ మ్యాచ్ ఫార్చ్యూన్ బరిషల్ , దర్బార్ రాజ్‌షాహీ జట్టు మధ్య జరిగింది. ఫార్చ్యూన్ బరిషల్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు ఈ మ్యాచ్‌లో 16 జట్లతో ఆడిన అనుభవం ఉంది. ఈ మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ అనుభవం అతని జట్టుకు చాలా ఉపయోగపడింది. దాని కారణంగా ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ తన జట్టుకు డ్యూయెల్ రోల్ ప్లే చేసి ముందుండి నడిపించాడు.ఓపెనర్‌గా వచ్చిన అతను తన జట్టు కోసం మ్యాచ్‌ను ముగించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూనే కెప్టెన్‌గా తన బాధ్యతను కూడా నెరవేర్చాడు. తమీమ్ ఇక్బాల్ రాజ్‌షాహీ జట్టుపై ఫార్చూన్ బరిషల్‌కు సిక్సర్‌తో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ్‌షాహి జట్టు ఫార్చూన్ బరిషాల్‌పై 20 ఓవర్లలో 169 పరుగుల విజయలక్ష్యంతో నిర్దేశించుకుంది.. దీనిని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన తమీమ్ ఇక్బాల్ 48 బంతుల్లో 86 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. 179 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. తమీమ్ బ్యాట్ నుంచి వచ్చిన మూడో సిక్సర్ జట్టు గెలుపును నిర్దారించింది.
బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్ పేరు కూడా ఉంది. తమీమ్ తన దేశం తరపున అత్యధిక పరుగులు, అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్. బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరపున క్రికెట్ ఆడడమే కాకుండా, మరో 15 జట్లకు క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అందులో ఒకటి ఫార్చ్యూన్ బరిషల్.
మిగిలిన జట్లు బంగ్లాదేశ్ A, బంగ్లాదేశ్ అండర్ 19, దురంతో రాజ్‌షాహి, ఖుల్నా టైగర్స్, పెషావర్ జల్మీ, పూణే వారియర్స్, ఆసియా XI, వెల్లింగ్‌టన్, లాహోర్ ఖలాండర్స్, చిట్టగాంగ్ డివిజన్, ఢాకా ప్లాటూన్, ICC వరల్డ్ XI, నాటింగ్‌హామ్‌షైర్, సెయింట్ లూసియా జూక్స్.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో ఫార్చ్యూన్ బరిషాల్ ఇప్పటివరకు తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో 3 మ్యాచ్‌లు ఆడింది.వాటిలో రెండు గెలిచి ఒకటి ఓడిపోయింది.