Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు.. 417 రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న ఖతర్నాక్ ప్లేయర్?

India's Champions Trophy Squad: ప్రస్తుతం అందరి దృష్టి ఛాంపియన్స్‌ ట్రోఫీపై పడింది. టోర్మమెంట్‌ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

Update: 2025-01-09 07:11 GMT

India's Champions Trophy Squad: ప్రస్తుతం అందరి దృష్టి ఛాంపియన్స్‌ ట్రోఫీపై పడింది. టోర్మమెంట్‌ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీకి సంబంధించిన టీమిండియా జట్టు ప్రకటనకు జనవరి 12వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దీంతో టీమిండియా జట్టుకు సంబంధించి అందరి దృష్టి పడింది. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత అందరి దృష్టి భారత జట్టుపై పడింది.

రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , జస్ప్రీత్ బుమ్రా వంటి క్రీడాకారులకు సంబంధించి ఆసక్తినెలకొంది. తాజా సమాచారం ప్రకారం షమీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహ్మద్‌ షమీ చివరిసారిగా 2023 నవంబర్‌ 19వ తేదీన అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. షమీ మ్యాచ్‌ ఆడక సుమారు 417 రోజులు అవుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన తర్వాత షమీ ఆటకు దూరంగా ఉన్నాడు.

షమీని బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక పేర్కొంది. ప్రపంచకప్ తర్వాత షమీ చీలమండలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పుడు మోకాలి వాపు కారణంగా అతను తిరిగి రావడం ఆలస్యమైంది దీంతో అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయాడు. ఇప్పుడు షమీ జట్టులోకి తిరిగి రావడంపై బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. షమీ అందుబాటులో ఉండాలంటే నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. ఇదిలా ఉంటే సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో షమీ తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరపున క్రమం తప్పకుండా బౌలింగ్ చేశాడు.

బుమ్రా..

ఇక జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదని నివేదికలో పేర్కొంది. సిడ్నీలో జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదో టెస్టులో బుమ్రా వెన్ను నొప్పికి గురయ్యాడు. వెంట‌నే బుమ్రాను ఆట మ‌ధ్య‌లోనే స్కానింగ్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో అత‌డు రెండు ఇన్నింగ్స్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. కీల‌కమైన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చేయ‌లేక‌పోయాడు. అయితే ఛాంపియ‌న్స్ ట్రోపీ 2025కు ముందు బుమ్రా గాయం భారత సెలక్టర్లను తెగ ఆందోళ‌న క‌లిగిస్తోంది. అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడుతాడా? లేదా అని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. కాగా బుమ్రా గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags:    

Similar News