Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు షాక్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు బుమ్రా దూరం
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న భారత జట్టు దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నమెంట్‌తో తన ఛాంపియన్స్ ట్రోఫీ జర్నీని మొదలుపెడుతుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ఇంకా 45రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ దీనికి ముందే టీం ఇండియాకు ఒక చేదు వార్త వచ్చింది. జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో జరిగిన సిడ్నీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు. దీని తరువాత, అతన్ని స్కాన్ చేశారు. దాని నివేదిక బయటకు వచ్చింది. అతని నడుములో వాపు ఉందని, అతను దాదాపు రెండు నెలల పాటు మైదానానికి దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
బుమ్రా ఎప్పుడు ఫిట్ అవుతాడు?
ఇంగ్లాండ్‌తో జరిగే T20 సిరీస్‌కు జనవరి 11, శనివారం నాడు జట్టును ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ సమావేశం కూడా నిర్వహించింది. బుమ్రా గాయం గురించి సమాచారాన్ని ఇందులో సెలెక్టర్లకు ఇచ్చారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి వైద్య బృందం బుమ్రా గాయంపై నిరంతరం నిఘా ఉంచింది. ముందుగా అతనికి ఫ్రాక్చర్ అయిందని ఊహించారు. కానీ నివేదిక వచ్చిన తర్వాత, అతని నడుములో వాపు ఉందని వెల్లడైంది.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. బుమ్రాను జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. తను కోలుకోవడానికి దాదాపు రెండు నెలలు సమయం పట్టవచ్చు. మార్చి మొదటి వారం నాటికి ఆయన పూర్తిగా కోలుకుంటారని భావిస్తున్నారు. మొదటి మూడు వారాల పాటు NCA అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. దీని తరువాత అతను రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది. అక్కడ అతని ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే భారత జట్టు తరపున ఆడటానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో జస్‌ప్రీత్ బుమ్రా అవసరానికి మించి బౌలింగ్ చేయడం వల్ల టీమిండియా ఇప్పుడు బుమ్రాకు గాయం రూపంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. బుమ్రా మార్చి మొదటి వారం నాటికి పూర్తిగా ఫిట్‌గా ఉంటాడు. కానీ అప్పటికే భారత్ గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసిపోతాయి. భారత జట్టు మార్చి 2న న్యూజిలాండ్‌తో తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. దీనిలో బుమ్రా ఆడటం కష్టంగా కనిపిస్తోంది. అంటే టీం ఇండియా సెమీఫైనల్‌కు చేరుకుంటే.. మార్చి 4న జరిగే ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశం ఉంది. ఇది అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఒక అంచనా మాత్రమే.