IND vs ENG: గంభీర్ కు ధోనీతో శత్రుత్వం.. CSK ఆటగాళ్లను తొలగించడంపై తీవ్ర దుమారం..రెచ్చిపోయిన అభిమానులు
IND vs ENG: గంభీర్ కు ధోనీతో శత్రుత్వం.. CSK ఆటగాళ్లను తొలగించడంపై తీవ్ర దుమారం..రెచ్చిపోయిన అభిమానులు
IND vs ENG:జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ను బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీం ఇండియా కొనసాగనుంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లలో ఆడిన చాలా మంది ఆటగాళ్లకు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు అవకాశం లభించింది. కానీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడే శివం దూబే, రితురాజ్ గైక్వాడ్‌లకు ఎందుకు అవకాశం రాలేదనే దానిపై అభిమానులు పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అభిషేక్ శర్మ మ్యాచ్ లో సరైన ప్రదర్శన చూపించక పోవడం మూలానా జట్టు నుంచి అతడిని జట్టు నుంచి తొలగిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి మరో అవకాశం లభించబోతోంది. 15 మంది సభ్యుల జట్టులో ఒక్క CSK ఆటగాడికి కూడా చోటు లేకపోవడం కూడా గమనించదగ్గ విషయం. అందుకే అభిమానులు సోషల్ మీడియాలో కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు మేనేజ్‌మెంట్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ కు ఎంఎస్ ధోనితో వ్యక్తిగత శత్రుత్వం ఉందని అందరికీ తెలుసని ఒక అభిమాని అన్నాడు. ఈ కారణంగా శివం దూబేను జట్టులో చేర్చలేదు. గైక్వాడ్‌ను మళ్లీ తొలగించారని మరొకరు కామెంట్ చేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన శివం దూబేకు కూడా స్థానం ఇవ్వలేదు. మరికొందరు అభిమానులు ఈ అన్యాయం CSK అభిమానులకే ఎందుకు జరుగుతుందో చెప్పడానికి గైక్వాడ్, దూబేలను తీసుకోకపోవడమే నిదర్శనమన్నారు. ఒక వ్యక్తి హద్దులు దాటి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు వ్యతిరేకంగా భారత జట్టులో రాజకీయాలు జరుగుతున్నాయని అన్నాడు.
https://x.com/ShuhidAufridi/status/1878116892482937135?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1878116892482937135|twgr^21f10c202fbdf42e2bebfa52f3585f189af1b64e|twcon^s1_&ref_url=https://www.abplive.com/sports/cricket/india-squad-for-england-t20-series-csk-players-missing-ruturaj-gaikwad-shivam-dube-fans-showed-anger-on-gautam-gambhir-ms-dhoni-2861121
ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.