AUS vs IND: టీమిండియాకు ఆందోళన కలిగించే వార్త.. తాజా ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో..

Mohammed Shami: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా చేరో టెస్ట్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-11 07:43 GMT

AUS vs IND: టీమిండియాకు ఆందోళన కలిగించే వార్త.. తాజా ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో..

Mohammed Shami: బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా చేరో టెస్ట్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పింక్‌ బాల్‌ టెస్టులో మాత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో తర్వాత జరగబోయే మ్యాచ్‌లపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. వచ్చే మ్యాచ్‌ల్లో టీమిండియా ఎలాగైనా గెలవక తప్పక పరిస్థితి ఉంది.

అయితే ఇదే సమయంలో తాజాగా ఓ వార్త టీమిండియాను కలవరపెడుతోంది. టీమిండియా బౌలింగ్‌ బలోపేతం కావాల్సిన తరుణంలో స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ జట్టులోకి రీఎంట్రీపై నిరీక్షణ కొనసాగుతోంది. చివరి రెండు టెస్ట్‌ మ్యాచుల్లో షమీ జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అతడు ఇంకా టెస్ట్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. దీంతో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకపోవచ్చని సమాచారం.

ఈ విషయంపై టీమిండియా సారధి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. షమీ మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో షమీ తాజాగా ఫిట్‌నెస్‌ టెస్టుకు వెళ్లాడని.. ఐదు రోజుల టెస్టులు ఆడేందుకు ఇంకా అతడు సిద్ధంగా లేడని సమాచారం. టెస్టుల్లో సుదీర్ఘంగా బౌలింగ్ వేసేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడా అన్న అంశంపై బీసీసీఐ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఇక షమీ చాలా కాలం ఆటకు దూరంగా ఉన్న నేపథ్యంలో అతడిపై ఒత్తిడి తీసుకురావాలనుకోవడం లేదని ఇటీవల రోహిత్‌ శర్మ తెలిపాడు. అతడి పరిస్థితిని నిపుణులు పర్యవేక్షిస్తున్నారన్న రోహిత్‌.. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అతడి కోసం జట్టు తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశాడు. మరి షమీ టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. 

Tags:    

Similar News