Rythu Bharosa scheme: సంక్రాంతికి రైతు భరోసా.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన

Rythu Bharosa scheme after Sankranthi 2025: సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు.. పథకాలు అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలన్నారు.

Update: 2024-12-12 09:59 GMT

Rythu Bharosa scheme: సంక్రాంతికి రైతు భరోసా.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన

Rythu Bharosa scheme after Sankranthi 2025: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు.. పథకాలు అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలన్నారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని కేటీఆర్ అన్నారు. ఏడాదిగా రైతు బంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని ఆయన గుర్తుచేశారు.

అధికారం కోసం అబద్ధాలు.. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు చెబుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు.

వర్షం కురుస్తుందో.. లేదో.. సాగునీరు అందుతుందో.. లేదో.. కరెంటు వస్తుందో.. లేదో.. పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో.. లేదో.. తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి.. ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలని కోరారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపరాదని ప్రభుత్వానికి సూచించారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ హితవు పలికారు.

Tags:    

Similar News