Mohan Babu: కొడుకు, కోడలుతో ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి..పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు

Update: 2024-12-10 03:27 GMT

 Mohan Babu Complaint on Manchu Manoj : నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారంటూ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్, తన భార్య నుంచి తనకు హాని ఉందని..రక్షిణ కల్పించాలంటూ మోహన్ బాబు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో అగ్గిరాజేసిన అంశమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.

గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం హాట్ టాపిగ్గా మారింది. సోమవారం సాయంత్రం మోహన్ బాబు తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదులతో గొడవలు బజారునపడ్డాయి. మొదట మనోజ్ కు మోహన్ బాబు మధ్య గొడవ జరిగిందంటూ ఆదివారం ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని మోహన్ బాబు తీవ్రంగా ఖండించారు. అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ ద్వారా కంప్లెయింట్ ఇచ్చారు మోహన్ బాబు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలోని మంచుటౌన్ లో 10ఏళ్లుగా నివాసం ఉంటున్న తన చిన్న కుమారుడు మనోజ్ అనుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి 4 నెలల క్రితం మళ్లీ తిరిగివచ్చాడని మోహన్ బాబు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ తను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈనెల 8వ తేదీన తన ఇంట్లో గొడవకు కారణమయ్యాడని..ఆ తర్వాత అతను 7 నెలల శిశువుని పనిమనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటినుంచి వెళ్లిపోయాడని మోహన్ బాబు ఫిర్యాదులో తెలిపారు.

ఆ తర్వాత వేరువేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగి వచ్చాడని..మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తుతెలియని దండగులు జల్ పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు తాను తెలుసుకున్నానని..అక్కడి నుంచే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు.


తనను ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించే ప్లాన్ చేస్తున్నారని..ఇంట్లో ఉన్న కొంతమంది..అక్కడున్నవారికి ప్రాణహాని కలిగించేలా ఉన్నారన్న భయం ఉందని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మనోజ్, మౌనిక వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలుతీసుకోవాలని ఇంటిని నుంచి వారందరినీ ఖాళీ చేయించాలని తగిన భద్రత కల్పించడంతోపాటు ఇంట్లో భయం లేకుండా ప్రవేశించేందుకు తోడ్పాటు అందించాలని మోహన్ బాబు రాచకొడ సీపీకి రాసిన లేఖలో విజ్నప్తి చేశారు. తనపై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కుటుంబ గొడవలు మరింత రచ్చకెక్కాయి.

Tags:    

Similar News