Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-12-11 14:25 GMT

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదలకు ముందు రోజు అంటే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో కు అర్జున్ హాజరయ్యారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందునే ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News