TG EAPCET 2025: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

TG EAPCET 2025: తెలంగాణలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది.

Update: 2025-01-15 10:00 GMT

TG EAPCET 2025: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

TG EAPCET 2025: తెలంగాణలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29 నుంచి ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఏప్రీల్ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. మే 12 న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లాసెట్, జూన్ 8,9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

డిప్లొమా విద్యార్ధులు ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ను మే 12న నిర్వహిస్తారు. ఈ సెట్ ను ఓయూ నిర్వహించనుంది. కన్వీనర్ గా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు. కాకతీయ యూనివర్శిటీ ఎడ్ సెట్ నిర్వహిస్తోంది. కేయూ ప్రొఫెసర్ బి. వెంకట్రామిరెడ్డి కన్వీనర్ గా ఉన్నారు. లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించనుంది.కన్వీనర్ గా బి. విజయలక్ష్మిని అపాయింట్ చేశారు ఐసెట్ ను మహాత్మాగాంధీ యూనివర్శిటీ నిర్వహిస్తుంది. ప్రొఫెసర్ అలవాల రవి కన్వీనర్ గా కొనసాగుతారు.

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల


Tags:    

Similar News