New Ration Cards: రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ అర్హతలుంటే చాలు..!

New Ration Cards: రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2025-01-15 06:02 GMT

New Ration Cards: రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ అర్హతలుంటే చాలు..!

New Ration Cards: రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 26న కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే అందిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తారు.

రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 13న గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. జనవరి 26, 2025న కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందించనుంది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు

1.కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు.

2.మండల స్థాయిలో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి

3.జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు, డీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.

4.రేషన్ కార్డుల దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాను గ్రామసభలో చదివి వినిపిస్తారు. ఈ గ్రామ సభలో ఈ జాబితాపై చర్చించి ఆమోదిస్తారు.

5.గ్రామసభ లేదా వార్డు సభలో ఆమోదించిన జాబితాను మండల, మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కు పంపుతారు.

6.ఈ జాబితాపై జిల్లా కలెక్టర్,జీహెచ్ఎంసీ కమిషనర్లు తుది నిర్ణయం తీసుకుంటారు.

7.జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదం తర్వాత రేషన్ కార్డులు జారీ చేస్తారు.

8.అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది

9.రేషన్ కార్డులో కొత్తగా సభ్యుల చేర్పింపు లేదా మరణించిన ఇతరత్రా కారణాలతో సభ్యుల చేర్పింపు చేయాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం.

రేషన్ కార్డులో పేర్ల మార్పులు చేర్పుల కోసం ఏం చేయాలి

కొత్తగా రేషన్ కార్డులో పేర్లలో మార్పులు, చేర్పుల కోసం ఆయా సభ్యుల పేర్లకు సంబంధించి ఆధార్ కార్డులు, మ్యారేజీ సర్టిఫికెట్లు అధికారులకు అందించాలి. అంతేకాదు సంబంధిత సభ్యుల బర్త్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. ప్రజా పాలన సమయంలో రేషన్ కార్డు కోసం ధరకాస్తులను స్వీకరించారు. అయితే అప్పట్లో దరఖాస్తు చేయనివారు ఆన్ లైన్ లో ధరకాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుకు ఏడాదికి కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఏటా 1.50 లక్షల ఆదాయం , పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డులు జారీ చేస్తారు.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలపై సంక్రాంతి తర్వాత ఆయా జిల్లాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఇంచార్జీ మంత్రుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.

Tags:    

Similar News