Guvvala Balaraju: అచ్చంపేటలో ఉద్రిక్తత... ఆలయం బైటి నుండే వెళ్లిపోయిన గువ్వల
Achampet News: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అచ్చంపేటలోని భ్రమరాంభిక దేవి ఆలయంలో జరిగే ప్రభోత్సవంలో పాల్గొనేందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు వచ్చారు.
Achampet News: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అచ్చంపేటలోని భ్రమరాంభిక దేవి ఆలయంలో జరిగే ప్రభోత్సవంలో పాల్గొనేందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు వచ్చారు. అయితే, అప్పటికే ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పూజలో పాల్గొనడంతో పోలీసులు గువ్వల బాలరాజును అడ్డుకున్నారని తెలుస్తోంది. పోలీసులు వారించినా వినకుండా గువ్వల బాలరాజు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులకు గువ్వల అనుచరులకు మధ్య తోపులాట జరిగింది.
గువ్వల బాలరాజు తన అనుచరులతో కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ గువ్వల బాలరాజు అన్నారు. అనంతరం ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.