BRS: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్

BRS: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2025-01-16 09:22 GMT

BRS: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్

BRS: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది గులాబీ పార్టీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆ పిటిషన్ లో బీఆర్ఎస్ కోరింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్ లో కోరింది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో పార్టీ నిర్ణయం చెప్పాలని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది.మేఘాచంద్ర కేసు తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోనేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ కోరింది.

బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు  చేసింది. ఈ విషయమై స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడం లేదని తాజాగా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ను ఆశ్రయించింది.

Tags:    

Similar News