Formula E-Race Case: కేటీఆర్ ను అడిగే ప్రశ్నలివే..
Formula E-Race Case: కేటీఆర్ ను ఫార్మూలా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Formula E-Race Case: కేటీఆర్ ను ఫార్మూలా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్ పై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదనేది కేటీఆర్ వాదన. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని కేటీఆర్ చెబుతున్నారు.
కేటీఆర్ ను అడిగే ప్రశ్నలివే
ఫార్మూలా ఈ కారు రేసులో ఎఫ్ఈఓకు రూ.55 కోట్ల నిధుల బదలాయింపు ఎందుకు చేశారు
విదేశీ కరెన్సీ రూపంలో నిధులు ఎందుకు చెల్లించారు
ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదు
అగ్రిమెంట్ కు ముందే నిధులు ఎందుకు చెల్లించారు
కేబినెట్ అనుమతి లేకుండా నిధులు ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారు
ఆర్ధిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు
ఫార్మూలా ఈ కారు రేసు ఒప్పందం నుంచి ఒప్పందం నుంచి ప్రమోటర్ వైదొలగడం, హెచ్ఎండీఏ నుంచి నిధుల బదలాయింపు వంటి అంశాలపై కూడా ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఏసీబీ నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.