Formula E-Race Case: ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
Formula E-Race Case: కేటీఆర్ ఫార్మూలా ఈ కారు రేసు కేసులో గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు.
Formula E-Race Case: కేటీఆర్ ఫార్మూలా ఈ కారు రేసు కేసులో గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. కేటీఆర్ ఈడీ కార్యాలయానికి విచారణ కోసం హాజరైనందున బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన,హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు విదేశీ కరెన్సీ రూపంలో నిధుల బదలాయింపుపై విచారించనున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై కూడా దర్యాప్తు చేయనున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘనలు, మనీలాండరింగ్ పై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్ వెంట వెళ్లిన లీగల్ టీమ్ ను ఈడీ అధికారులు విచారణ గదిలోకి అనుమతించలేదు.ఈడీ విచారణకు న్యాయవాదులను అనమతించాలని కేటీఆర్ కోరలేదు. ఏసీబీ విచారణకు న్యాయవాదులను తీసుకెళ్లేందుకు కేటీఆర్ అనుమతి కోరలేదు. ఈడీకి చెందిన ముగ్గురు అధికారులు ఆయనను విచారిస్తున్నారు.
ఫార్మూలా ఈ కారు రేసు కేసులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 2024 అక్టోబర్ 18న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2024 డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ పేరును ఏ1 గా , ఏ 2 గా అరవింద్ కుమార్, ఏ3 గా బీఎల్ఎన్ రెడ్డి గా చేర్చారు. ఏసబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసులో ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించింది.