School Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..3 రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సర్కార్

Update: 2024-12-10 00:14 GMT

School Holidays: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. డిసెంబర్ లో జరుపుకునే క్రిస్మస్ పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సెలవులు డిసెంబర్ 24, 25, 26వ తేదీల్లో ఇచ్చారు. 24వ తేదీన క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్ పండగ, 26న బాక్సింగ్ డే జనరల్ హాలీడే తో కలిపి పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మూడు రోజుల సెలువులు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు బ్యాంకులకు కూడా ఈ రోజుల్లో సెలువులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే గత ఏడాది క్రిస్మస్ సందర్బంగా ఐదు రోజులు సెలువులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ ఏడాది మాత్రం మూడు రోజులు పరిమితం చేసింది.

రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవించే క్రమంలో క్రిస్టియన్లకు ముఖ్యమైన క్రిస్మస్ పండగకు కూడా సెలవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దీంతోపాటు క్రిస్మస్ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. క్రిస్మస్ పండగను కోట్లాది మంది క్రిస్టియన్లు ఆచార సంప్రదాయాలతో ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తుంటాయి.

ప్రత్యేకంగా కిస్మస్ చెట్లను అలంకరించి, ప్రార్థనలు చేయడం, పేదవారికి బహుమతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ సెలవులతో విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి క్రిస్మస్ పండగ సంతోషంగా జరుపుకుంటారు.

Tags:    

Similar News