Amazon: రూ. 2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొడంగల్ యువకుడికి కొలువు

Amazon: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ అమెజాన్ లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

Update: 2024-12-09 07:10 GMT

Amazon: రూ. 2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొడంగల్ యువకుడికి కొలువు

Amazon: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ అమెజాన్ లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. డిసెంబర్ 9న ఆయన విధుల్లో చేరుతున్నారు. 2019 పట్నా ఐఐటీలో లో ఆయన కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ నిపుణులు గేల్ డయాస్ వద్ద 3 నెలలు ఇంటర్న్ షిప్ చేశారు. ఆ తర్వాత బెంగుళూరు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ లో రెండేళ్లు పనిచేశారు. 2023 అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచ్ సెట్స్ నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్ లో ఎంఎస్ పట్టా పొందారు.

2022లో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన అభిజిత్ అమెజాన్ లో రూ.1.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఐర్లాండ్ లోని డబ్లిన్ లోని అమెజాన్ సంస్థలో ఆయన డెవలప్ మెంట్ ఇంజనీర్ గా అపాయింట్ అయ్యారు. 2021 లో ఈ కాలేజీ విద్యార్ధులు ఏటా రూ. 40 లక్షలు వార్షిక వేతనం పొందారు.

Tags:    

Similar News