Revanth Reddy: దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ
Telangana Assembly: డిసెంబర్ 9వ తేదీ తెలంగాణకు పర్వదినం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana Assembly: డిసెంబర్ 9వ తేదీ తెలంగాణకు పర్వదినం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రారంభంరోజున సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడి ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం అన్నారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు.