ఆశా వర్కర్ల ఆందోళనతో కోఠిలో ఉద్రిక్తత.. పోలీసు అధికారిపై చేయిచేసుకున్న మహిళ
Asha Workers Protest: ఆశా వర్కర్ల ఆందోళనతో సోమవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Asha Workers Protest: ఆశా వర్కర్ల ఆందోళనతో సోమవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రూ. 18 వేల జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆశా వర్కర్ల మధ్య తోపులాట జరిగింది. పోలీసులపై ఆశా వర్కర్లు దాడికి దిగారు. డీఎంఈ కార్యాలయానికి వెళ్లేందుకు ఆశావర్కర్లు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమయంలో మహిళలను పోలీసులు డీసీఎంలో ఎక్కించే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో ఓ పోలీస్ అధికారి చూసుకోకుండా డీసీఎం వ్యాన్ డోర్ వేశారు. ఈ సమయంలో ఓ మహిళ కాలు డోర్ లో పడింది. దీంతో ఆమె బాధను తట్టుకోలేక డీసీఎం డోర్ వేసిన పోలీస్ అధికారిపై చేయిచేసుకున్నారు.