Revanth Reddy: రైతు ఈర్యానాయక్ కు బేడీలపై విచారణకు ఆదేశం
లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు ఈర్యానాయక్ చేతులకు బేడీలు వేయడంపై తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు ఈర్యానాయక్ చేతులకు బేడీలు వేయడంపై తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఈర్యానాయక్ సంగారెడ్డి జైలులో ఉన్న సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను జైలు అధికారులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో రైతు చేతికి బేడీలు వేశారు. ఈ విషయం సీఎం దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఈర్యానాయక్ కు తొలుత సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈర్యానాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి సంగారెడ్డి వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రైతు నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.