Viral Video: అనకొండ పక్కన పడుకోవడం ఏంటీ సామీ.. చూస్తేనే గుండె జారినట్లవుతోంది

Update: 2024-12-12 15:22 GMT

Viral Video of a man lying down with giant python: పెంపుడు జంతువులు పక్కన ఉంటే సరదాగా ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా కాసేపు వాటితో గడిపితే చాలు ప్రశాంతంగా మారుతుంది. అందుకే చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల ఈ ట్రెండ్ ఎక్కువైంది. అయితే పెంపుడు జంతువులు అనగానే మనకు సహజంగా గుర్తొచ్చేది కుక్కలు లేదా పిల్లులు.

ఎవరైనా వీటినే ఇంట్లో పెంచుకుంటారు. అయితే అనకొండను పెంచుకుంటే ఎలా ఉంటుంది? వినడానికే షాకింగ్‌గా ఉంది కదూ! అయితే ఓ వ్యక్తి మాత్రం దీనిని నిజం చేసి చూపించాడు. ఓ భారీ కొండచిలువను పెంచుకుంటున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మెయిల్ హోల్‌స్టన్ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో అంతలా ఏముందనేగా..

ఓ వ్యక్తి ఎంచక్కా బెడ్‌పై పడుకొని ఏదో మ్యాగజైన్‌ చదువుతున్నారు. అదే సమయంలో అదే బెడ్‌లో ఓ వైపు తన పెంపుడు శునకం ఉంది. అయితే ఇది సర్వసాధారణమైన విషయమే అనుకోవచ్చు. కానీ మరోవైపు ఓ పెద్ద అనకొండ కూడా ఉంది. ఇదే ఇక్కడ అసలైన షాకింగ్‌ మ్యాటర్. ఆ వ్యక్తి ఏ టెన్షన్‌ లేకుండా పుస్తకంలో పేజీలు తిరగేస్తుంటే.. మరోవైపు ఆ పాము మాత్రం నెమ్మదిగా కదులుతోంది. దీనంతటినీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.

వీడియో చూసిన నెటిజన్లకు గుండె జారినంత పనవుతోంది. వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత గుండె ధైర్యం ఏంటంటూ కొందరు స్పందిస్తుండగా, మరికొందరు మాత్రం పాములను పెంచుకునే ట్రెండ్ వస్తోంది కావొచ్చు అంటూ చమత్కరిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Tags:    

Similar News