Viral Video: యువకుడు చేసిన పనికి ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు.. వైరల్‌ వీడియో..!

Viral Video: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అంటుంటారు. కొన్ని సందర్భాలను చూస్తే ఇది నిజమే అనిపించకమానదు.

Update: 2024-12-06 05:31 GMT

Viral Video: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అంటుంటారు. కొన్ని సందర్భాలను చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. రకరకాల పనులు చేస్తూ కొందరు వార్తల్లో నిలుస్తుంటారు. ఒకరు మద్యం మత్తులో చేస్తే మరికొందరు మతి స్థిమితం లేకుండా చేస్తారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా క్షణాల్లో అరచేతిలో వాలిపోతున్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద ఫ్లై ఓవర్‌పై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. అదే సమయంలో ఓ వ్యక్తి బ్రిడ్జ్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీంతో ఆయనకు రోడ్డు పక్కనే ఉన్న స్లాబ్ లాంటి నిర్మాణం ఏదో ఉన్నట్లు కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా ఒక మనిషి పడుకున్నాడు. దీంతో మొదట ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ఆ తర్వాత అతన్ని లేపడానికి ప్రయత్నించాడు.

అయితే ఎంతకీ పలక్కపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదకర స్థితిలో హ్యాపీగా నిద్రపోతున్న ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. వెంటనే బ్రిడ్జి పైనుంచి సదరు స్లాబ్‌పైకి ఒక నిచ్చెనను వేసి అతడి వద్దకు చేరుకున్నారు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించారు.

దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పడుకోవడానికి మరో చోటు లభించలేదా బ్రదర్‌ అంటూ కొందరు కామెంట్స్‌ చేయగా, మరికొందరు మాత్రం ఇది కచ్చితంగా ప్లాన్‌ ప్రకారమే చేశాడంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

 

Tags:    

Similar News