Viral Video: బస్ స్టాప్‌లో ఎదురు చూస్తున్న యువకుడు.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన బస్సు, షాకింగ్ వీడియో..!
Viral Video: ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వారి తప్పు కారణంగా కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Viral Video: ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వారి తప్పు కారణంగా కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన చేతిలో లేని వాటికి కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మన మానాన మనం వెళ్తున్నా ప్రమాదం తరుముకొస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే ఇది అక్షర సత్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంతకీ ఏమైందంటే.. ఓ యువకుడు బస్‌స్టాప్‌లో ప్లాట్‌పామ్‌పై ఉన్న చెయిర్‌పై కూర్చున్నాడు. తన బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. బస్సు వచ్చేంత సేపని జేబులోని స్మార్ట్ ఫోన్ తీసి ఏదో చూస్తున్నాడు. అయితే అంతలోనే ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ప్లాట్‌ఫామ్ ముందు ఆగాల్సిన బస్సు అదుపు తప్పి కుర్చీలో కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చింది. ఊహించని ఈ పరిణామానికి ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
కుర్చీలకు, బస్సుకు మధ్య ఇరుక్కుపోయాడు. అయితే వెంటనే పొరపాటును గమనించిన బస్సు డ్రైవర్.. బస్సును వెనక్కి తీసుకున్నాడు. దీంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడున్న ప్రయాణికులు మొదట ఈ షాకింగ్ ఇన్సిడెంట్‌కి భయపడ్డా ఆ తర్వాత వెంటనే యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అతన్ని కుర్చీలో నుంచి పైకి లేపారు. అయితే యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డడు స్పష్టమవుతోంది.
ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ చూసిన నెటిజన్లు భయపడుతున్నారు. ఆ యువకుడి అదృష్టం బాగుంది అందుకే బచాయించాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం బస్సు డ్రైవర్ తీరును తప్పుబడుతున్నారు.