Viral Video: ఎవుడ్రా వీడు.. ప్రాణాలంటే లెక్కలేనట్లుంది. వైరల్‌ వీడియో..

Viral Video: తాజాగా ఓ యువకుడి చేసిన పని సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

Update: 2024-12-04 03:30 GMT

Viral Video: ఎవుడ్రా వీడు.. ప్రాణాలంటే లెక్కలేనట్లుంది. వైరల్‌ వీడియో..

Viral Video: వయసులో ఉన్నప్పుడు జోష్‌ వేరేలా ఉంటుంది. ముఖ్యంగా యువత ఆలోచన క్రేజీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎలాగైనా వైరల్‌ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాల ఫీట్లు చేస్తున్నారు. రీల్స్‌కు లైక్స్‌కు రావాలనే ఉద్దేశంతో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడి చేసిన పని సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఆ యువకుడు చేసిన పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఓ యువకుడు బైక్‌పై అత్యంత వేగంగా వెళ్తున్నాడు. అయితే సాధారణంగా వెళ్తే కిక్కు ఏముంటుందనుకున్నాడో ఏమో.. ముందు టైర్‌ను గాల్లో లేపుతూ రయ్యిమని దూసుకుపోయాడు. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ బైక్‌ను గాల్లోకి లేపుతున్నాడు. తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా పక్కనున్న వారి ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేశాడు.

దీనంతటినీ వెనకాల నుంచి వస్తున్న మరో వాహనంలో ఉన్న వ్యక్తి రికార్డ్‌ చేశాడు. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. లైక్స్‌ కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఎవుడ్రా వీడు.. ప్రాణాలంటే లెక్కలేనట్లుంది. అంటూ కొందరు స్పందిస్తూ.. మరికొందరు మాత్రం బైక్‌ ఏమాత్రం అదుపు తప్పకుండా మనోడు డ్రైవ్‌ చేసిన విధానం సూపర్‌ అంటూ స్పందించారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.



Tags:    

Similar News