Optical Illusion: ఇందులో కనిపిస్తున్న నెంబర్‌ ఏంటో తెలుసా.? అనుకున్నంత ఈజీ కాదండోయ్‌..!

Optical Illusion: ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-11 08:29 GMT

Optical Illusion: ఇందులో కనిపిస్తున్న నెంబర్‌ ఏంటో తెలుసా.? అనుకున్నంత ఈజీ కాదండోయ్‌..!

Optical Illusion: ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు మరింత క్రేజ్‌ పెరిగింది. ప్రతీ రోజూ నెట్టింట ఇలాంటి ఫొటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న మ్యాజిక్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన ఫొటో చూడగానే ఏదో బ్లర్‌లాగా కనిపిస్తోంది కదూ! అయితే అందులో ఒక నెంబర్‌ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఆ నెంబర్‌ ఏంటో కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో ముఖ్య ఉద్దేశం. నెంబర్‌ను ఈజీగా గుర్తుపట్టొచ్చు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే చూడ్డానికి సింపుల్‌గా కనిపిస్తున్నా ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడం అంత సులభమైన విషయం కాదండోయ్‌. ఓసారి పైన కనిపిస్తున్న ఫొటోను జాగ్రత్తగా గమనించండి. వెంటనే మీకు '45283' నెంబర్ కనిపిస్తోంది కదూ! కానీ జాగ్రత్తగా గమనిస్తే అసలు నెంబర్‌ వేరేది ఉంది.

ఆ నెంబర్‌ను కనిపెట్టడమే ఈ పజిల్‌ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే చాలా మంది నెటిజన్లు ఈ ఫొటోలో 3452839 అనే నెంబర్ కనిపిస్తోందని కామెంట్స్‌ చేశారు. అయితే వాస్తవానికి మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారు. ఇంతకీ ఈ పజిల్‌ అసలు సమాధానం ఏంటనేగా మీ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం విషయానికొస్తే.. '3452839'. మీరు పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? లేదా.? మీ ఐ పవర్‌కు ఈ పజిల్‌ ఒక బెస్ట్‌ ఉదాహరణగా చెప్పొచ్చు. 


Tags:    

Similar News