Viral Video: రీల్స్ పిచ్చి.. పెదాలకు పచ్చి మిర్చి రాసుకున్న యువతి.. ఆ తర్వాత ఏమైందంటే..?
Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు తమలోని ప్రత్యేకమైన నైపుణ్యాలను, కళలను, ఆలోచనలను రీల్స్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది వారికి గుర్తింపు తెస్తుంది. ఒకప్పుడు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోతున్నారు. కానీ మరికొందరు ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పనులు చేస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువతి చేసిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఏదైనా వీడియో నచ్చితే నెటిజన్లు దాన్ని షేర్ చేస్తుంటారు. మరికొందరు కామెంట్స్ చేస్తుంటారు. దీంతో వాళ్లు సార్ట్స్ గా మారిపోతున్నారు. కానీ ఇక్కడ ఓ యువతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పెదాలు బాగుండాలని కొందరు లిప్ బామ్, లిప్ స్టిక్ రాసుకుంటారు. కానీ ఈ యువతి మాత్రం పెదాలకు పచ్చి మిర్చి రాసుకుంది. మిర్చిని కట్ చేసి దాన్ని పెదాలకు అప్లై చేసింది. ఆ మిర్చిని లిప్ స్టిక్ లాగా తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ రాసుకుంది. మొదట యువతి కవర్ చేసినప్పటికీ.. మంటతో విలవిలలాడిపోయినట్టు కనిపిస్తోంది. ఆమె ముఖంలో ఆ మార్పులు స్పష్టంగా కనిపించాయి.
సాధారణంగా మిర్చి పౌడర్ కానీ, పచ్చి మిర్చి కానీ కట్ చేసిన తర్వాత ఆ చేతులతో శరీరంలో ఎక్కడైన పట్టుకుంటే ఆ చోట విపరీతమైన మంట ఉంటుంది. కానీ ఈ యువతి ఏకంగా పేదలకే అప్లై చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఇలాంటివి అవసరమా అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరైతే కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.