ప‌వ‌న్ అత్తారింటికి దారేది

Update: 2018-03-16 04:19 GMT

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై టీడీపీ నేతల విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుంది. గుంటూరు స‌భలో ఏపీ ప్ర‌భుత్వ అవినీతి తూర్పార‌బ‌ట్టిన ప‌వ‌న్ పై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇన్నిరోజులు త‌మ‌కు మ‌ద్దతు ప‌లికిన ప‌వ‌న్ ఒక్కసారిగా త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. 
గ‌తంలో టీడీపీ వెన‌క ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నార‌ని బీజేపీ విమ‌ర్శ‌లు చేస్తే ..అవును..! మా వెంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నాడ‌ని  తెలుగు త‌మ్ముళ్లు చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే తెలుగు త‌మ్ముళ్లు బీజేపీ వెనుక ప‌వ‌న్ ఉన్నారంటూ అటు అసెంబ్లీలో ఇటు బ‌య‌ట ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ స్క్రిప్ట్ , వైసీపీ మ‌ద్ద‌త‌తో ప‌వ‌న్ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశారు.  పవన్ విమర్శలు, ఆరోపణలపై సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు అసెంబ్లీ వేదికగా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చినరాజప్ప, ఆదినారాయణ రెడ్డి, బోండా ఉమ, డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దా వెంకన్న, కళా వెంకట్రావు తదితరులు దుమ్మెత్తి పోశారు. 
ప్ర‌శ్నించ‌డానికో పార్టీ అని పార్టీని పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుగా త‌న‌ని తాను ప్ర‌శ్నించుకోవాల‌ని అన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో హీరో అత్తారింటికి దారి వెతికిన హీరో..నిజ జీవితంలో ప‌వ‌న్ కూడా త‌న అత్తారింటికి దారెటుందో వెతికే ప‌నిలో ప‌డ్డార‌ని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ అనుకున్నాం . కానీ అజ్ఞాత వాసిలా అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని సూచించారు. నారాలోకేష్ , చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ను జ‌నాలు బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తార‌ని విమ‌ర్శ‌లు చేశారు. 
త‌న 40ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎన్నో సంక్షోబాల్ని ఎదుర్కున్న‌ట్లు చంద్ర‌బాబు అన్నారు.  కేంద్రం ఏపీకి సహకరించడం లేదని ఏపీకి హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. విభన చట్టం హామీలు అమలు చేయడం లేదన్నారు. కష్టకాలంలో తనకు అండగా ఉండకుండా తనపై విమర్శలా అని చంద్రబాబు ప్రశ్నించారు. గ‌త నాలుగేళ్లుగా గుర్తుకు రాని టీడీపీ అవినీతి ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా అని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు.

 బీజేపీ చెప్పింది చేయకుండా కొందరిని తనపైకి రెచ్చగొడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు. రాష్ట్రాలను కేంద్రం బలహీనపరుస్తోంది రాష్ట్రాలను కేంద్రం బలహీనపరుస్తోందని కూడా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను నాలుగేళ్లు ఓపిక పట్టానని, బీజేపీని అనకుండా తనను విమర్శించడం ఏమిటన్నారు. అంతేకాదు, తమిళ రాజకీయాల్లా ఏపీ రాజకీయాల్లో కేంద్రం వేలు పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు మాట తీరు చూస్తుంటే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వెళ్లేందుకే సిద్ధమయ్యారని అర్థమవుతోంది. పవన్ బీజేపీ చేతిలో పావుగా మారారని, ఆయనను తాము గౌరవంగా చూసుకుంటే ఇలాగేనా మాట్లాడేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు, పవన్ వ్యాఖ్యల వెనుక మోడీ ఉన్నారని, ఇక ఎదురుదాడికి దిగండని చంద్రబాబు టీడీపీ నేతలకు ఆదేశాలు కూడా జారీ చేశారని అంటున్నారు. అయితే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయవద్దని సూచించారట. 

Similar News