బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో కమలం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తక్షణమే ఆలస్యం చేయకుండా పార్టీ అధిష్టానం ఏపీ బీజేపీ నేతలతో ఢిల్లీలో సమావేశానికి రావాలంటూ పిలుపునిచ్చింది. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందనేది అంతా ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ భేటీలో ప్రధానంగా బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై సమాలోచనలు చేయనున్నారు. వైసీపీ తో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుంది..? జనసేనతో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై చర్చించనున్నారు.
మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావసభలో వైసీపీ - బీజేపీ ని గురించి ఒక్క మాటమాట్లాడలేదు. మరి ఇదే అంశం చర్చకు రావచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రం అభివృద్ధి చేస్తే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటాను అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తో పవన్ కల్యాణ్ చేతులు కలుపుతారా..? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది.
దీనికి తోడు జగన్ కూడా బీజేపీతో సానుకూలంగానే ఉన్నారు. మరి ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలతో భేటీ కానున్న అధిష్టానం పొత్తు ఏ పార్టీతో పెట్టుకుంటే దీని వల్ల తమకు ఎంత ప్రయోజనం ఉంటుందన్న కోణంలోనూ ఆ పార్టీ జాతీయ నేతలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనికి తోడు కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అన్నీ పార్టీల్నీ సంప్రదించింది. పనిలో పనిగా సీఎం చంద్రబాబు కూడా ఓ మాట కలిపింది.
వైసీపీకి మద్దతిస్తే క్రెడిట్ జగన్ కు పోతుందని భావించిన చంద్రబాబు సైలెంట్ అయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో పవన్ టీడీపీని విమర్శించడంతో చంద్రబాబు వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఉన్నట్లుండి ఏమైందో చంద్రబాబు తన మనసు మార్చుకొని తానే సొంతం కేంద్రంపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
ఇలా ఎందుకు చేశారని మీడియా మిత్రులు ప్రశ్నిస్తే వైసీపీ - బీజేపీ - జనసేన కూడబలుక్కున్నాయని..ఆ పార్టీల ఎత్తుల్ని చిత్తు చేసి తామే స్వయంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చేయాలని , అందుకే కేంద్రంలో ఉన్న ఇతర పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరిపామని అంటున్నారు.
అయితే వీటిన్నింటితో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్ని అంచనా వేసుకున్న బీజేపీ ఏ పార్టీకి చేతులు కలపాలి అనే అంశంపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీతో చేతులు కలిపినా పార్టీకి వచ్చే లాభం ఎంత..? భవిష్యత్తులు పొత్తుపెట్టుకునే పార్టీలు ఎలా ఉంటాయి అని బేరీజు వేసుకొని నిర్ణయానికి రానున్నాయి.