చంద్ర‌బాబును అణ‌గ‌దొక్కుతున్న పీఎం మోడీ..?

Update: 2018-03-13 21:54 GMT

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంక‌న్న పీఎం మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా , రైల్వే జోన్ ఇవ్వ‌క‌పోవ‌డంపై స్పందించిన బుద్ధా  సీఎం చంద్ర‌బాబు ముస్లీంలకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని ..ఆ కార‌ణంగానే చంద్ర‌బాబును అణ‌గ‌దొక్కాల‌ని చూస్తున్న‌ట్లు తెలిపారు. 
 ఆర్టికల్ 13 ప్ర‌కారం రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామంటూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చిన త‌రువాత కూడా ఎన్నోవాగ్ధానాలు చేసిన క‌మ‌లం పార్టీ నేత‌లు చంద్ర‌బాబు హ్యాండిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నట్లు టీడీపీ చెబుతున్నారు.  
పార్ల‌మెంట్ లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ ఇరు పార్టీల ఎంపీలు స‌భ‌ను స్తంభింప‌చేశారు. స‌భ‌ స‌జావుగా సాగేలా చ‌ర్య‌లు తీసుకున్న అవి విఫ‌లం కావ‌డంతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. ఆ ప్ర‌క‌ట‌న వ‌చ్చి వారంలో రోజులు కూడా అంత‌లోనే రైల్వే జోన్ ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది. 
దీంతో ఏపీ ప్ర‌జ‌లు కేంద్రం తీరును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.  అయితే టీడీపీ నేత‌లు సైతం త‌మ‌కు మిత్ర‌పక్షంగా ఉన్న బీజేపీని తూర్పార‌బ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్థిక నేరస్థులకు అపాయింటుమెంట్ ఇచ్చి, సీఎం చంద్రబాబుకు ఇవ్వలేదన్నారు.
నాడు గుజరాత్‌లో ముస్లీంలను ఊచకోత కోస్తే ఏపీలో చంద్రబాబు ముస్లీంల పక్షాణ నిలబడ్డారని బుద్దా వెంకన్న అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముస్లీంల పక్కన నిలబడినందుకు అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.
చంద్రబాబు, మోడీ మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నాయని తాను భావించడం లేదని సుజన అన్నారు. గోద్రా అల్లర్లు తదనంతర పరిణామాలు, నాడు చంద్రబాబు వైఖరి నేపథ్యంలో మోడీ ఆయనపై కక్ష కట్టారన్న ప్రచారాన్ని కూడా సుజన కొట్టిపారేశారు. ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు అలా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.  

Similar News