ఇకపై టీడీపీ వైఫల్యాన్ని ఎండగతాం అంటూ ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. గాలిజనార్ధన్ రెడ్డి అవినీతి పరుడైతే మీరు ఇసుక మాఫీయాను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రాగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇసుక స్కీం కింద పేదలకు లారీ ట్రక్కు ఇసుక ఫ్రీగా పంపిణీ చేస్తామని ..రూ.15వేలు వసూలు చేశారని సూచించారు. అదేమంటే ఇసుకమాఫీ ఆటకట్టించిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తారా..? ఇసుక మాఫీయాలో హస్తం ఉన్న ఎమ్మెల్యేకి వత్తాసు పలుకుతారా..? అని మండిపడ్డారు. మీ అవినీతి
సపోర్ట్ చేయడానికి మీకు మేం మద్దతు పలకాలా అని అన్నారు. మీరు ఏం అభివృద్ధి చేశారని 2019ఎన్నికల్లోమీకు మద్దతు పలకాలి అని సూటిగా మాట్లాడారు.
అంతేకాదు అధికారంలోకి వచ్చిన మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. రాష్ట్రం కోసం ప్రతీసారి ఢిల్లీ వెళుతున్నామన్న చంద్రబాబు అక్కడ పెద్దలతో రాష్ట్ర డిమాండ్ల గురించి చర్చిస్తున్నారా..? లేదా నాయకులు చేస్తున్న అవినీతి తెరపైకి రాకుండా ప్రలోభాలకు గురిచేస్తున్నారా అని విమర్శించారు.
కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయం వల్ల మళ్లీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా మరోసారి మరో ఉద్యమం రాదా? కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినప్పుడు రాత్రికి రాత్రి చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని అన్నాను. ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని అన్నారు.
ఒక ముఖ్యమంత్రి, మిగతా మంత్రి వర్గం అంతాకలిసి ప్రజలని ఏమనుకుంటున్నారు? వారికి తెలివితేటలు లేవని అనుకుంటున్నారా? నిశబ్దం చేతకాని తనమని అనుకోకండి.. ప్రత్యేక హోదా కావాలని గవర్నర్ నరసింహన్ తో కూడా చదివించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు ఆంధ్రుల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడారు" అని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా పై మాట్లాడిన పవన్.. ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని తెలంగాణ పోరాటం జరిగినంత బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని తెలంగాణకు చెందిన నాయకులు టీవీలో మాట్లాడారని అన్నారు.
ఆ మాటలు వింటే నాకనిపించింది ఏపీ రాజకీయాలు అంత సున్నితమైనవా అని. మందు పాతరలు పెట్టి పేల్చేస్తారు ఇక్కడి రాజకీయ నాయకులు. నిరాయుధలని హత్య చేస్తారు, మొన్న కడపలో ఏం జరిగిందో చూశాం.
అవసరమైతే ప్రాణ త్యాగం చేసి అయినా అన్న తన తమ్ముళ్ల ప్రాణాలను కాపాడుకుంటాడు. మిగతా వారిలా వెళ్లి బలిదానాలు చేసేయండి అని నేను అనను. వారి సమాధులపై కూర్చొని రాజకీయాలు చేయను. నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేనో సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని మా నాన్న మంగళగిరిలో ఇక్కడే పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారని గుర్తు చేశారు.