లెఫ్ట్ పార్టీ నేతలతో భేటీ అయిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా , రాజకీయ భవిష్యత్తుపై పవన్ కల్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబు చేసిన విమర్శలపై పవన్ స్పందించారు.
గుంటూరు జనసేన ఆవిర్భావసభలో టీడీపీ చేస్తున్న అవినీతిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, అధికార పార్టీకి చెందిన నేతలు అవినతీనికి పాల్పడుతున్నారని సూచించారు. దుర్గగుడి, ఇసుక మాఫి లాంటి అంశాలను లేవనెత్తిన పవన్ మంత్రి నారాలోకేష్ చేసిన అవినీతిపై తూర్పారబట్టారు. తమిళనాడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికేసులో నారా లోకేష్ ప్రమేయం ఉందని..అందువల్లే చంద్రబాబు 29సార్లు ఢిల్లీ వెళ్లినా పీఎం మోడీ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని అన్నారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించారు. పవన్ కల్యాణ్ బీజేపీ రాసిన స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. పీఎం మోడీ తమిళనాడులో బీజేపీ పాలన తరహా ఏపీలో కూడా చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీయాల్సిన పవన్ ..పోరాటం చేస్తున్న మమ్మల్ని విమర్శించడం తగదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఇవ్వాళ విజయవాడ సీపీఐ కార్యాలయంలో ఆపార్టీ నేతలతో భేటీ అయిన పవన్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
2014లో టీడీపీ మద్దతు ఇచ్చిన పవన్ ..ఆ పార్టీ నేతలు చేస్తున్న అవినీతి పై సీఎం చంద్రబాబుతో చర్చించామని అన్నారు. ఈ చర్చలతో చంద్రబాబు పార్టీలో అవినీతి పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటారని ఊహించా. కానీ అదేం జరగలేదు. అందుకే ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న తాను టీడీపీ పై విమర్శలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చిన పార్టీనేతలు అవినీతి పాల్పడుతున్నారని ప్రజలు తనని ప్రశ్నిస్తున్నట్లు గుర్తు చేశారు.
అనంతరం లెఫ్ట్ పార్టీ లు తనకు , తన తండ్రికి అంటే ఎంతో ఇష్టమని పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాటాలు కొనసాగించనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.హైద్రాబాద్‌లో మైనార్టీల సంక్షేమం కోసం సిపిఎం నేత మధు చేసిన పోరాటాలు తనకు స్పూర్తిగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. మరో వైపు రాష్ట్ర విభజన సమయంలో తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించింది వామపక్షాలు మాత్రమేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
తాను ప్రజల డైరెక్షన్‌లోనే పనిచేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను బిజెపి డైరెక్షన్‌లో పనిచేస్తున్నానని టిడిపి చేసిన విమర్శలకు పవన్ కళ్యాణ్ ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఏ పార్టీ డైరెక్షన్‌లో పనిచేయబోనని ఆయన చెప్పారు . ప్రజలు ఏం కోరుకొంటారో, ప్రజలకు ఏం అవసరమో, ప్రజల డైరెక్షన్‌లోనే తాను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.