తమిళనాడుకు చెందిన మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపణలపై స్పందించారు. తనకు లోకేష్ తో సంబంధమే లేదని.. చంద్రబాబునే ఒకటి రెండుసార్లు కలిశాను తప్ప.. లోకేష్ ను ఇంత వరకూ కలిసింది లేదని.. పవన్ కల్యాణ్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. పైగా.. ఓ సెటైర్ కూడా వేశారు. తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నపుడు.. చాలా మంది అభ్యర్థులు తనను కలుస్తారని చెప్పాడు.
తనంటే.. అందరికీ సెంటిమెంట్ అని.. తనను కలిస్తే విజయం సాధిస్తామన్న నమ్మకం చాలా మందిలో ఉంటుందని శేఖర్ రెడ్డి అన్నాడు. అందుకే.. జనసేన నాయకుడు పవన్ కూడా తన పేరు తలుచుకుని ఉంటారని ఎద్దేవా చేశాడు. టీటీడీ పాలకమంలి సభ్యత్వం కూడా నాటి సీఎం జయలలిత సిఫారసుతోనే అందింది తప్ప.. చంద్రబాబుతో కూడా తనకు సంబంధాలు లేవని తేల్చాశారు. ఇక్కడి వరకూ అందరికీ తెలిసిన కథే. ఇప్పుడు మనకు ఓ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
పవన్ ఆరోపణలు చేశారు.. శేఖర్ రెడ్డి తప్పుబట్టారు. మరి..పవన్ ఇప్పుడు ఏమని చెబుతారు? సైలెంట్ గానే ఉంటారా? ఇంకో సభ పెట్టినపుడు మాట్లాడతారా? లేదంటే ప్రెస్ మీట్ పెట్టి శేఖర్ రెడ్డి అవినీతితో లోకేష్ కు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆధారాలు చూపిస్తారా? ఏం చేస్తారు.. ఏం చేయబోతున్నారు.. వేచి చూద్దాం.