ఓటుకు నోటు కేసులో కలకలం. ఓటుకు నోటు కేసు మరో ఐదు రోజుల్లో విచారణకు రానున్న నేపథ్యంలో ఈ కేసులో ఏ4గా జరూసలేం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ కు లేఖ రాశారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
గతంలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ రూ.5కోట్లు ఆఫర్ చేసింది. దీనికి మధ్యవర్తిగా ఉన్న నాటి టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అంతేకాదు ఈ ఢీల్ నడిచే సమయంలో సీఎం చంద్రబాబు స్టీఫెన్ సన్ తో 'మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ.. గో ఏ హెడ్ అని మాట్లాడడం, ఆయన వీడియోలో బట్టబయలు కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండగా..మరో ఐదు రోజుల్లో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఏ4 గా ఉన్న నిందితుడు , టీడీపీకి సన్నిహితంగా ఉండే జెరూసలేం మత్తయ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తాను అప్రూవర్ మారుతున్నట్లు, అందుకు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు.
అసలు తనకు ఓటుకునోటు కేసుకు సంబంధం లేదని అన్నారు. అయితే తాను క్రైస్తవుల సమస్యలపై చర్చించేందుకు స్టీఫెన్ సన్ ను కలిసినట్లు చెప్పారు.
అంతేకాదు తనను టీడీపీ - టీఆర్ఎస్ పార్టీలు హతమార్చేందుకు కుట్రపన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనైతిక చర్యలకు పాల్పడుతు తనని చంపుతామని బెదిరించడం దారుణమని ఆరోపించారు.
ఈ కేసు హైకోర్టులో ఉండగా ఏపీ ప్రభుత్వం తనకు సహకరించిందని, ఇప్పుడు అదే కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని వాపోయారు. అందుకే నేను పార్టీ ఇన్ పర్సన్‌గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశాను. ఓటుకు నోటు కేసుతో పాటు ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. రెండు కేసుల్లోని రహస్యాలను సీబీఐ వెలికితీయాలి..'' అంటూ మత్తయ్య సుప్రీంకోర్టు సీజేకు విజ్ఞప్తి చేశారు.