చంద్ర‌బాబు కంట‌త‌డిపై క‌త్తిమ‌హేష్ సెటైర్లు

Update: 2018-03-13 23:29 GMT


ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.  ఈ సెష‌న్స్ లో మాట్లాడిన చంద్ర‌బాబు భావోద్వేగంతో క‌న్నీరుపెట్టుకున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌ల‌తో కేంద్రంపై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన చంద్ర‌బాబు.  నాడు రాష్ట్ర‌విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామ‌ని పీఎం మోడీ తెలిపార‌ని అన్నారు.  కానీ ఇప్పుడు మాత్రం అమ‌రావతి నిర్మాణ కోసం స‌హ‌క‌రించాలని కేంద్రాన్ని కోరుతుంటే ..బీజేపీ నేత‌లు మాత్రం డ్రీమ్ సిటీ అని హేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అన్నారు.
అయితే చంద్ర‌బాబు అసెంబ్లీలో ప్ర‌సంగించే స‌మ‌యంలో క‌న్నీటి పెట్టుకున్నారంటూ వార్త‌లు రావ‌డంతో .. ఆ వార్త‌లు స్పందిచిన క్రిటిక్ క‌త్తిమ‌హేష్ సీఎం చంద్ర‌బాబు పై సెటైర్లు వేశారు. అమరావతి అనే ఒక మహత్తరమైన కల గురించి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో చెబుతూ కన్నీళ్లపర్యంతం అయ్యారు. బాధ కలిగింది.' అని పేర్కొన్నారు.
 మహేష్ కత్తి ఇంకా 'అయ్యా చంద్రబాబు గారు ! అమరావతిని భ్రమరావతి చేసింది మీరు. దాదాపు ముఫై నగరాల మోడల్స్ చూపించి సింగావతి అనిపించింది మీరు. దాన్నొక బాహుబలి సెట్ స్థాయికి దిగజార్చింది మీరు.' అని పేర్కొన్నారు.
 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా మహేష్ కత్తి ఓ ట్వీట్ చేశారు. 'ఇరవైరెండు సంవత్సరాలున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఏమీ చెయ్యని పవన్ కళ్యాణ్, ప్రపంచాన్ని కాపాడటానికి బయల్దేరాడు. ఆ మాట అంటే, ఒక అమ్మాయి మీద అభిమానులు దాడులు చేస్తారు. అది జనసేనాని పంథా, జనసైనికుల పద్దతి. షేమ్! షేమ్!!' అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే చంద్ర‌బాబు ప్ర‌సంగం స‌మ‌యంలో అరుణ్ చేసిన కామెంట్స్ పై స్పందించారు. సెంటిమెంట్ కు డ‌బ్బులు రావ‌ని చెప్పిన అరుణ్ జైట్లీ  సెంటిమెంట్ కారణంగానే తెలంగాణ ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఎంతో పోరాటంతో సాధించుకున్నదని,  అలాగే ఏపీ హక్కుల కోసం పోరాడాలని, కానీ తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాన్ని తక్కువ చేయవద్దని ట్వీట్ చేశారు. 
 ఇదిలా ఉండగా, ఏపీలోని రోడ్లపై బీజేపీ నేతలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రోడ్లకు కేంద్రం బాగా నిధులు ఇచ్చిందని బీజేపీ చెబుతోందని, అది వాళ్ల డబ్బు కాదన్నారు. ప్రజాధనాన్ని వాళ్లు ఇచ్చినట్లు చెప్పుకోవడం ఏమిటన్నారు. పబ్లిక్ ప్రయివేటు సెక్టారులో రోడ్లు వచ్చాయని, రేపటి రోజున రోడ్లు వేసిన వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్నారు.

Similar News