ఏపీలో బీజేపీ ప‌ప్పులుడ‌క‌వ్

Update: 2018-03-18 18:14 GMT

సీఎం చంద్ర‌బాబు మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఉగాది వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న కేంద్రం యుద్ధం చేయాల‌ని చూస్తుంద‌ని అన్నారు. మొన్న‌టికి మొన్న కేంద్రం త‌మిళ‌నాడు త‌ర‌హ ఏపీ లో రాజ‌కీయం చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు ఆరోపించారు.
 అంతేకాదు టీడీపీని దెబ్బతీయడానికి మహాకుట్ర జరుగుతోందని, ఈ పథక రచనలో చాలామంది పెద్దలు ఉన్నారని  అన్నారు. కేంద్రం గేమ్ మొదలు పెట్టిందని, ఇకపై యుద్ధమే చేస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ గేమ్‌లో పవన్‌నే కాకుండా స్థానికంగా మరికొందరినీ ఈ కుట్రలో భాగస్వామ్యులను చేసిందని.. ఎలాంటి రాజకీయాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలో బీజేపీ ఇక్కడ రాజకీయం చేస్తోందని, బలమైన నాయకత్వం ఉన్న చోట బలహీనపర్చాలని బీజేపీ యత్నాలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
అయితే ఆ వ్యాఖ్య‌ల‌పై కొన‌సాగింపుగా ఉగాది వేడుక‌ల్లో మాట్లాడిన చంద్ర‌బాబు .. కేంద్రం ఎవరిపై యుద్ధం చేద్దామనుకుంటోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలపై యుద్ధం చేస్తారా అని సవాల్ చేశారు. 
కేంద్రం ఇచ్చిన నిధుల‌పై టీడీపీ లెక్క‌లు చూపించలేద‌ని బీజేపీ ఆరోపిస్తుంది. ఆ ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం మనకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేశామని చంద్రబాబు చెప్పారు. కేసుల మాఫీ కోసమే ఓ పార్టీ కేంద్రం వెంటపడుతోందని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. మరో పార్టీ నాలుగేళ్ల తర్వాత తనను విమర్శిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. 
 ఆత్మగౌరవం అంటే నిధులు వస్తాయా అని వెకిలిగా మాట్లాడటం సరికాదన్నారు. తమిళనాడు తరహాలో రాజకీయం చేస్తామంటే ఏపీలో చేయనివ్వమని బీజేపీని ఉద్దేశించి అన్నారు. అలాంటిది ఏపీలో జరగదని, జరగనివ్వమన్నారు.

Similar News