ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఏపీ భవన్‌లో చంద్రబాబుతో భేటీ అయిన చంద్రబాబు ప్రస్తుత పరిణామాలు, తాజా రాజకీయాలు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. అయితే మోడీ అంటే మొదట్నుంచీ వ్యతిరేక భావనతో ఉన్న కేజ్రీవాల్ ఏపీభవన్‌కి వచ్చి చంద్రబాబుతో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరికొందరు జాతీయ నేతలతోనూ సమావేశంకానున్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం 3గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.